పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయండి : టీటీడీ జెఈవో వీరబ్రహ్మం

తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను టీటీడీ జెఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు,భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై ఇంజినీరింగ్,ఆలయ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆలయ గోపురానికి సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆర్కియాలజి విభాగం అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. ఇందుకోసం టెండర్లు పిలిచామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అదేవిధంగా,పచ్చదనంపెంపు,తాగునీరు,ప్రసాద వితరణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశామన్నారు.
వివాహాలు చేసుకునేందుకు మండపం నిర్మించాలని అర్చకులు కోరారని, అందుకోసం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కల్యాణవేదిక వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని,చక్కటి దారి కల్పించాలని ఆదేశించామన్నారు. పిఏసిలో గదుల అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించామన్నారు. అదేవిధంగా,ఆర్చిల నిర్మాణం,కల్యాణవేదిక వద్ద వివాహాలు చేసుకునే సదుపాయం,రామకోటి స్థూపం తదితర అంశాలను ఈవో దృష్టికి తీసుకెళతామన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

