YV Subba Reddy : ఆ రైతులకు అండగా టీటీడీ : చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
YV Subba Reddy : నేల తల్లిని రక్షించేందుకే ఈ మహాసమ్మేళనం నిర్వహిస్తున్నామని, గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు టీటీడీ అండగా...

చిత్తూరు : (YV Subba Reddy) తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జాతీయ గో మహా సమ్మేళనం జరుగనున్నది. టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమ్మేళనాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. నేల తల్లిని రక్షించేందుకే ఈ మహాసమ్మేళనం నిర్వహిస్తున్నామని, గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు టీటీడీ అండగా ఉంటుందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి గో ఆధారిత ఉత్పత్తులను కొనుగోలు చేస్తామన్నారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. సీఎం జగన్ సూచనల మేరకు టీటీడీ పాలక మండలి సనాతన హిందూ ధర్మ ప్రచారం చేస్తూనే, గో సంరక్షణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని చెప్పారు. రసాయన ఎరువులతో తయారుచేసిన దాణా తినే ఆవుల పాల వల్ల మహిళల్లో క్యాన్సర్ పెరుగుతున్నదని పలు అధ్యయనాల్లో తేలిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అందువల్లనే సీఎం జగన్ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
జాతీయ గో మహాసమ్మేళనం సందర్భంగా 24 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు స్టాల్స్ టీటీడీ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్న అగరబత్తులు, ఆయుర్వేద పంచగవ్య ఉత్పత్తులు, టీటీడీ ప్రచురణలు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన ఫొటోలను ఉంచారు. గో మహాసమ్మేళనానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి విచ్చేసిన రైతులకు తగిన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సమ్మేళనానికి హాజరైన రైతులకు సాంప్రదాయ భోజనం, త్రాగునీరు అందిస్తున్నారు. గుడికో గోమాత, శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం, నవనీత సేవ, సప్త గో ప్రదక్షిణశాల వంటి కొత్త కార్యక్రమాలను తీసుకొచ్చి గోవు పట్ల ప్రజల ఆలోచన తీరులో మార్పు తీసుకురానున్నట్లు ఇటీవల మీడియా సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
సమాజ్‌వాది పార్టీలో చేరిన బీఎస్పీ, బీజేపీ ఎమ్మెల్యేలు
అనారోగ్యంతో భార్య మృతి.. తట్టుకోలేక భర్త కన్నుమూత
తిరుమల ఘాట్‌లో ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రారంభించనున్న సీఎం జగన్
బద్వేలులో ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్
నవంబర్ 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?!
కాటరాక్ట్ ఉన్నవారిలో గుండె జబ్బులు ఎక్కువ : ఆస్ట్రేలియా పరిశోధకులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

