హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తేతెలంగాణ) : తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది. బుధవారం ఆయాశాఖల అధికారులతో అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి సమీక్ష నిర్వహించారు. పది రోజులపాటు జరిగే దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీఐపీలు మినహా.. ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. జనవరి 10న స్వర్ణరథం ఊరేగింపు, 11న చక్రస్నానం నిర్వహించనున్నట్టు తెలిపారు.