YV Subba Reddy | తిరుమల తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే కోర్టు ద్వారా కేసులు పెట్టి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
తూతూ మంత్రంగా ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను బదిలీ చేశారని ప్రభుత్వ తీరుపై వైవీ సుబ్బారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై అక్రమ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. కూటమి సర్కార్లో సంక్రాంతి శోభ లేదని అన్నారు.