అమరావతి : ఏపీలోని నంద్యాల(Nandyala) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కన్నకొడుకు ఓ హిజ్రాతో (Hijra) ప్రేమ వ్యవహారం కొనసాగిస్తుండడంతో మనస్తాపానికి గురై తల్లిదండ్రులు ఆత్మహత్య (Parents Suicide) చేసుకున్నారు.
నంద్యాలలోని ఎస్బీఐ కాలనీకి చెందిన సుబ్బరాయుడు, సరస్వతి దంపతుల కుమారుడు సునీల్ బీటెక్ మొదటి సంవత్సరం ఫెయిలయి ఆటో డ్రైవర్లతో స్నేహమేర్పచుకుని హిజ్రాలతో కలసి తిరుగున్నాడు. ఈ క్రమంలో ఓ హిజ్రాతో కొనసాగిస్తున్న ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు కుమారుడిని మందలించారు.
విషయం తెలుసుకున్న హిజ్రాలు సుబ్బరాయుడు దంపతులు నడుపుతున్న దుకాణం వద్దకు వచ్చి అసభ్యకరంగా వ్యవహరించారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, కుమారుడు తన వైఖరిని మార్చుకోకపోవడంతో మనస్తాపానికి గురై తల్లిదండ్రులిద్దరూ పురుగు మందు తాగారు. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ అసుపత్రిలో చేర్పించారు. అక్కడ వారి పరిస్థితి విషమంగా మారడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.