అమరావతి : ఏపీలో భారీ వర్షాలు ( Heavy Rains ) పలు జిల్లాలను అతలంకుతలం చేస్తున్నాయి. వర్షాలకు వృద్ధ దంపతులు మృతి చెందిన విషాద ఘటన శ్రీకాకుళం (Srikakulam District) జిల్లాలో చోటు చేసుకుంది. మందస మండలం హంసరాలి పంచాయతీ పరిధిలోని చిన్నటూర్లో గురువారం రాత్రి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు మట్టిగోడ కూలింది.
దీంతో ఆ ఇంట్లో నిద్రపోతున్న వృద్ధ దంపతులు సవర చిన్న బుడియా, ఆయన భార్య రూపమ్మపై గోడ కూలి వారిపై మట్టి పెళ్లలు పడ్డాయి. స్థానికులు వారిని హరిపురం ఆసుపత్రికి తరలించగా ఊపిరాడక అప్పటికే మృతి చెందారని వైద్యులు ద్రువీకరించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.