అమరావతి : తన అభిమాన నటుడు సినిమా విడుదల సందర్భంగా ఓ వీరాభిమాని ఆనందం ప్రాణాల మీదకు వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ మూవీ(Salaar Movie) శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవర్మంలోని రంగా సినిమా థియేటర్లో సలార్ సినిమా ఫ్లెక్సీ (Flexi) కడుతూ ప్రభాస్ అభిమాని బాలరాజు(27) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు.
ఫ్లెక్సీ రాడ్ హైవోల్టేజీ తీగలకు తగలడంతో ప్రమాదానికి గురయ్యాడు. అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు, స్నేహితులు థియేటర్ ఎదుట ఆందోళన నిర్వహించారు.