అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు(Teacher) బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) తో మృతి చెందాడు. ఏపీ ప్రభుత్వం ఆయా కేంద్రాల్లో పదోతరగతి మూల్యాంకనం(Tenth Evaluation )నిర్వహిస్తుంది . బాపట్ల పురపాలక పాఠశాలలో పదో తరగతి మూల్యాంకనం కేంద్రంలో పర్చూరు వైఆర్ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాసరావుకు ఉన్నతాధికారులు(officials) డ్యూటీ వేశారు.
గురువారం విధుల్లో ఉండగా శ్రీనివాసరావు బ్రెయిన్ స్ట్రోక్తో కిందపడిపోగా వెంటనే అతడిని బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు(Guntur) తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందడంతో మూల్యాంకనం కేంద్రంలో విషాదం నెలకొని ఉంది.