తిరుమల : ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో రిసెప్షన్ సిబ్బంది స్నేహపూర్వకంగా మెదగాలని టీటీడీ ఈవో శైలాజరావు ( EO Shylaja rao) ఆదేశించారు. మంగళవారం రిసెప్షన్ విభాగం నిర్వహాణాధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ(TTD) పరిధిలో ఉన్న గదులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యం, గరిష్ట సంఖ్యలో యాత్రికుల వసతి గురించి రిసెప్షన్ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
సీడీ రీఫండ్, తిరుపతిలో అందుబాటులో ఉన్న వసతి, కొత్త పీఏసీలు, ఇతర సంబంధిత సమస్యలపై ఈవో ఆరా తీశారు. తరుచూ ఆలయానికి వచ్చి గదులను బుక్ చేసుకుంటున్న పురుష భక్తులకు గదుల కెటాయింపు తగ్గించాలని ఆదేశించారు. యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఐటీ విభాగం ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, రిసెప్షన్, ఐటీ వింగ్ అధికారులు పాల్గొన్నారు.