గ్రీన్ ఎనర్జీ ఏర్పాటుకు పైలెట్ ప్రాజెక్టుగా తిరుమల ఎంపిక..
Green energy| పర్యావరణ పరిరక్షణ లో భాగంగా తిరుమల లో టీటీడీ చేపట్టిన గ్రీన్ పవర్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడానికి ముందుకు
తిరుమల : పర్యావరణ పరిరక్షణ లో భాగంగా తిరుమల లో టీటీడీ చేపట్టిన గ్రీన్ పవర్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసియెన్సీ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తో సమావేశమయ్యారు.
తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న గ్యాస్ ఆధారిత ఆవిరికి బదులుగా సోలార్ ఆధారిత ఆవిరిని ఉపయోగించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ అధికారులు వివరించారు. కాకుల కొండ వద్ద పవన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విషయాలు తెలియజేశారు. ప్రత్యామ్నాయ విద్యుత్ కు సంబంధించి తిరుమల ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు.
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి గల అన్ని అవకాశాలు పరిశీలించడానికి ఒక బృందాన్ని పంపుతామన్నారు. టీటీడీ అధికారులు ఈ బృందంతో కలసి ప్రతిపాదనలు పంపితే ఇందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తామని వారు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

