తిరుమల : తిరుమల (Tirumala) లో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది . వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 20 కంపార్టుమెంట్ల (Compartments) లో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం(Darsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 59,522 మంది భక్తులు దర్శించుకోగా 18,544 తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం ( Hundi Income) రూ. 3.51 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు. ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు శుక్రవారంతో ముగుస్తున్నాయి. డిసెంబర్ 12న వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందుగా ఈ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి .