మూసీ వాగులో మునిగి ముగ్గురు మైనర్లు మృతి
టంగుటూరు మండలంలో విషాదం చోటుచేసుకున్నది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు శవాలై తేలారు. పొడవారిపాలెం వద్ద మూసీ వాగులో..
ప్రకాశం: టంగుటూరు మండలంలో విషాదం చోటుచేసుకున్నది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు శవాలై తేలారు. ఆదివారం నుంచి ఈ ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. పొందూరు సమీపంలోని పొడవారిపాలెం వద్ద మూసీ వాగులో 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న విద్యార్థుల మృతదేహాలను సోమవారం ఉదయం వెలికితీశారు.
వాసు (15), జగన్ (12), మహేశ్ (13) లు నిడమానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం క్రికెట్ ఆడేందుకు పొందూరు పంచాయతీ పొదవారిపాలెం సమీపంలోని ముసీ వాగు దగ్గరకు వెళ్లారు. అనంతరం ఈత కొట్టేందుకు వీరు వాగులోకి దిగారు. సమీపంలోని కొందరు రైతులు నీటిలోకి దిగొద్దని వీరిని వారించారు. అయినప్పటికీ వినకుండా సరదా ఈత కొట్టేందుకు దిగారు.
చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. మరికొందరు స్థానికులతో కలిసి వెతకడం ప్రారంభించారు. బాలురు మూసీ వాగు వైపు వెళ్లారని తెలుసుకుని వారంతా అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటిగా ఉన్నందున గాలింపు నిలిపివేశారు. సోమవారం ఉదయం రెస్క్యూ వర్కర్లు తిరిగి వెతగ్గా.. తప్పిపోయిన ముగ్గురు బాలుర మృతదేహాలు లభించాయి. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి పోలీసులు విచారణ చేపట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

