అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి వెల్లడించారు. అయితే సమన్వయ లోపం మాత్రం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నామని ఆమె అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మున్నెన్నడు లేనివిధంగా పురోగతి సాధిస్తుందని తెలిపారు. పేదల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని వెల్లడించారు.
కరోనా సమయంలో ప్రజలకు ఉచిత రేషన్ అందించామన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఇతోదికంగా సహాయం చేస్తుందని తెలిపారు. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ – జనసేన కూటమికి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కొత్త కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.