అమరావతి : ఓ రైతు వద్ద లంచం తీసుకున్న తహసీల్దార్‌ను ఏసీబీ అదికారులు(ACB Raid) రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా ( Nellore District ) ముత్తుకూరు తహసీల్ కార్యాలయంలో (Tahasil Office) ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు పొలం వివరాల కోసం తహసీల్దార్‌ను సంప్రదించాడు.
అయితే తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి రూ. 20 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు వ్యూహం ప్రకారం తహసీల్ కార్యాలయంపై దాడి చేశారు. రైతు నుంచి రూ. 20 వేలు తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన అధికారులు తహసీల్దార్‌ను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తహసీల్దార్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు.