Bandla Ganesh : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాస్య నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh).. సినీ నటి రోజాను ఉద్దేశించి తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని నగరి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో దిగిన రోజా.. ఓటమి అంచుల్లో ఉన్నారు. ఓటమి ఖాయమని దాదాపు తేలిపోయింది.
దాంతో ఆమె తన అనుచరులతో కలిసి తిరుపతిలోని కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ ఆమెను ఉద్దేశించి తన ఎక్స్ ఖాతాలో ఒక చమత్కార పోస్టు చేశారు. ‘జబర్దస్త్ పిలుస్తోంది రా.. కదలిరా..@RojaSelvamaniRK’ అనే టెక్స్ట్ పెట్టి, దానికి రోజా డ్యాన్స్ ఫోజుతో దిగిన ఫొటోను షేర్ చేశారు.
బండ్ల గణేశ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

Bandla Ganesh Post On Roja