TDP Candidates | టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడికి అవకాశం
TDP Candidates | ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ అభ్యర్థుల స్థానాలకు కూటమి పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయి.
అమరావతి : ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ అభ్యర్థుల ( Rajya Sabha Candidates ) స్థానాలకు కూటమి పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయి. ఇప్పటికే జనసేన పార్టీ తరుపున లింగమనేని రమేశ్ పేరును ఖరారు చేయడంతో శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
కాగా టీడీపీ నుంచి సానా సతీశ్( Sana Satish ), భాష్యం రామకృష్ణ ( Rama Krishna ), చింతకాయల విజయ్ ( Vijay ) పేరును పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేసి పేర్లను ప్రకటించారు. భాష్యం రామకృష్ణ 2014 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఆశించి భంగ పడ్డారు. దీంతో ఆయనకు ఈసారి రాజ్యసభ అవకాశాన్ని కల్పించారు. ఇక చింతకాయల విజయ్ తండ్రి అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా కొనసాగుతున్నారు.
పార్టీలో సీనియర్ వర్ల రామయ్య పేరును చివరివరకు పరిశీలించిన చంద్ర బాబు చివరకు విజయ్ వైపు మొగ్గుచూపారు. సతీశ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రస్తుతం పనిచేస్తున్నా ఇంకా ఏడాదిన్నర మాత్రమే పదవికాలం ఉండడంతో ముందుగానే అతడిని సామాజిక సమీకరణల్లో భాగంగా ఆయన పేరును ఖరారు చేశారు. టీడీపీ అభ్యర్థులంతా సోమవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

