అమరావతి : టీడీపీకి చెందిన నాయకుడు, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ( JC Prabhakar Reddy) ఏపీ బీజేపీ నాయకులపై (BJP Leaders) సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ కంటే జగన్ మంచోడని కితాబు ఇచ్చారు. ఈ నెల 1వ తేదీన జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సు అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో దగ్ధమయ్యింది(Fire). ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేశారు. ఈ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఎవరైనా మంటలు అంటించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టి సీసీ ఫుటేజీలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి బీజేపీ శ్రేణులపై అనుమానం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
మీ కన్నా జగనే మేలు కదరా.. థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జగన్ మీకంటే మంచోడు.. జగన్ నా బస్సులు నిలపెడితే మీ బీజేపీ ప్రభుత్వం చేతకాని కొడుకుల లాగా బస్సు తగలబెట్టారు
నేను ఏమైనా మీకు భయపడతా అనుకుంటున్నారా.. సిగ్గులేని నా… pic.twitter.com/YasHjwWyzG
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2025
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ నా బస్సులు నిలపెడితే బీజేపీ ప్రభుత్వం బస్సులను తగలబెట్టడం నీచమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. సిగ్గులేని నా కొడుకుల్లారా.. అంటూ మండిపడ్డారు. గతంలో మూడు వందల బస్సులకు ఆటంకం కలిగిస్తేనే తాను ఏడవలేదని ఒక్క, రెండు బస్సులకు నష్టం జరిగితే తాను చింతించబోనని పేర్కొన్నారు. బస్సులను దగ్ధం చేసి ఏం సాధించారని ప్రశ్నించారు.
తన పాత బస్సుల్లో ఒకటిని తన డ్రైవర్‌కు రూ. 10 లక్షల బదులు రూ. 5 లక్షలకే అమ్ముకుని డ్రైవర్‌ను ఆదుకుని, ఉపాధి కల్పించానని, అటువంటి బస్సుకు నష్టం చేసి డ్రైవర్ జీవితాన్ని నాశనం చేశారని అన్నారు. వాస్తవంగా ఘటన స్థలం వద్ద జరిగింది ఒకటయితే పోలీసులు మాత్రం షార్ట్‌సర్క్యూట్‌తో బస్సు కాలిపోయిందని కేసు నమోదు చేశారని ఆరోపించారు.