తండ్రీకొడుకు డ్రామాలాడుతున్నారు : మంత్రి కన్నబాబు
డ్రామాలాడుతున్నారు | తిరపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేశ్ డ్రామాలు ఆడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు.

అమరావతి : తిరపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేశ్ డ్రామాలు ఆడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు.
ఇటీవల జరిగిన తిరుపతి సభలో రాళ్లు విసిరారంటూ చంద్రబాబు రాళ్ల డ్రామా ఆడితే.. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సవాల్ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో 151 శాసనసభ స్థానాలు గెలిచిన సీఎం జగన్‌కు సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఓడిన లోకేశ్‌కు పోలిక ఏంటని ఎద్దేవా చేశారు.
ఓడ రేవులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏమన్నారో తెలుసుకుని స్పందిస్తామని ఆయన అన్నారు.
కాగా తిరుపతి ఉప ఎన్నిక వేళ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు హీట్ పెంచుతున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన లోకేశ్ నిన్న అలిపిరి వెళ్లారు.
వివేకా హత్య కేసులో తన కుటుంబానికి ప్రమేయం లేదని ప్రమాణం చేయడానికి అలిపిరికి వచ్చానని.. తన సవాలును స్వీకరించి సీఎం జగన్ అలిపిరికి వస్తారా అని ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

