అమరావతి : అగ్నిపథ్ నిరసనలకు కారకుడని అనుమానిస్తున్న ఆవుల సాంబశివరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకోలేదని పల్నాడు ఎస్పీ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసానికి సూత్రదారిగా సాయి ఆర్మీ శిక్షణ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఎస్పీ స్పందించారు. అయితే సికింద్రాబాద్ ఘటనపై సుబ్బారావును ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ పోలీసులు మాత్రం తమను సంప్రదించలేదని అన్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అతడిపై తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సుబ్బారావును యూపీ పోలీసులు ప్రశ్నించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరించారు.