Srisailam | మహాదుర్గ పాహిమాం.. కైలాసవాహనంపై శ్రీశైలేశుడు
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ,మండపారాధన, జపానుష్టానాలు, రుద్రహోమం, పారాయణాలు జరిపించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలను నిర్వహించినట్లు ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. సాయంత్రం సాయంకాల పూజలు జపానుష్టాధి పూజాధి కార్యక్రమాలు జరిపించారు.
కైలాస వాహనంపై శ్రీశైలేశుడు
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్పమూర్తులను కైలాస వాహనంపై వేంచేంబుజేసి అర్చక వేద పండితులు షోడషోపచార ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాసవాహనంపై అధిరోహించిన స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు నేరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని ఇతిహసాల్లో చెబుతున్నాయి.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవదైన శ్రీశ్రీశైల భ్రమరాంబ అమ్మవారు మహాదుర్గ అలంకరణలో భక్తులను కరుణించారు. అష్టభుజాలు కలిగిన ఈదేవి పద్మం, శంఖం, చక్రం,గద, త్రిశులం, ఖడ్గం ధరించి భక్తాధులకు దర్శనమిచ్చారు.. ఈ అమ్మవారిని దర్శించడం వలన ఏటువంటి శత్రు భాధలు, పీడలు నుండి భక్తులను కాపాడుతుందని నమ్మిక.
కన్నుల పండువగా గ్రామోత్సవం
వాహన పూజల అనంతరం స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం ఆలయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండపం మీదుగా బయలు వీరభధ్రస్వామి వరకు కన్నుల పండువగా సాగింది. గ్రామోత్సవంలో కోలాటం, జానపద పగటి వేషాలు, బుట్టబొమ్మలు, గొరువ నృత్యం, తప్పెట చిందు, కర్ణాటక జాంజ్, కొమ్మువాయిద్యం, జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు విన్యాసాలు, లంబాడీల నృత్యాలు వివిధ రకాల కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజుతో పాటు పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్‌కుమార్, ఏఈఓలు హరిదాస్, ఫణిధర్ ప్రసాద్, మోహన్ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ అయ్యన్న, సూపరింటెండెంట్లు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
సోమవారం ప్రభోత్సవం.. నందివాహనం పై స్వామిఅమ్మవార్లు,
సోమవారం ప్రభోత్సవం నిర్వహించనున్నారు. కాగా, మహా సరస్వతి అలంకారంలో శ్రీశైల భ్రామరి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఈవో డీ పెద్దిరాజు తెలిపారు. రాత్రి శివదీక్ష శిబిరాల్లో కన్నడిగుల వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం జరగనున్నాయి.
ఆలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని ఆలయ దక్షిణ మాఢవీధిలోని కళారాధన, పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన భక్తసంగీత విభావరి, సంప్రదాయ నృత్యాలు, ప్రవచనం, డోలు కుణిత, హైదరాబాద్‌కు చెందిన సంగీత దర్శకులు నిహల్ బృందం సంగీతం భక్తులను అలరించాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

