తిరుమల: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం(Vaikuntha Dwara Darshan) టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందగా, అనేక మంది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. ఆ తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులు ఇవాళ దర్శనం కల్పించారు. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మెన్ ఆదేశాల ప్రకారం.. తొక్కిసలాటలో గాయపడ్డవారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అధికారుల ప్రకారం గాయపడ్డ వారిలో మొత్తం 52 మందికి ప్రత్యేకంగా ఉత్తరద్వార దర్శనం కల్పించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం అనేక మంది ప్రముఖులు కూడా తిరుమలకు చేరుకున్నారు.
#WATCH | Andhra Pradesh | Tirumala Tirupati Devasthanam (TTD) provided Vaikuntha Dwara Darshan to those injured in the stampede on the directions of the CM and TTD Chairman. Special Vaikuntha Ekadashi darshan was arranged for a total of 52 people by the officials. pic.twitter.com/qPhrKkN9ZU
— ANI (@ANI) January 10, 2025