(TTD Special Festival) మరో రోజులో కొత్త ఏడాది రానున్నది. ఇప్పటికే కొత్త సంవత్సరం తొలి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ బోర్డు. ఎలాంటి సిఫారసు లేఖలు తీసుకురావద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. కాగా, జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
జనవరి 2వ తేదీన అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. 13న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి సన్నిధిలో రాపత్తు, 14న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణీతీర్థ ముక్కోటి, భోగి పండుగ, 15న మకర సంక్రాంతి, 16న శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం, 17న రామకృష్ణ తీర్థ ముక్కోటి, 18న శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం, 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు, 26న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు, 27న శ్రీవారు తిరుమలనంబి ఆలయానికి వేంచేసే విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.