Srisailam | శ్రావణ మాసోత్సవాల్లో ఆర్జిత అభిషేకాల నిలిపివేత
Srisailam | ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకూ నిర్వహించే శ్రావణ మాసోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని ద్రుష్టిలో పెట్టుకుని ఆర్జిత అభిషేకాలను నిలిపివేశారు. స్పర్శ దర్శనం, అలంకార దర్శనం వేళలను సవరించినట్లు ఈఓ ఎస్ లవన్న తెలిపారు.
Srisailam | గత నెల 18న అధిక శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకు నిజ శ్రావణ మాసం ఉంటుంది. నిజ శ్రావణ మాసంలో ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకు శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. అధిక శ్రావణ మాసంతోపాటు నిజ శ్రావణ మాసంలో, సెలవు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం శ్రావణ మాసోత్సవంలో పర్వదినాలు, సెలవు దినాల్లో ఆర్జిత అభిషేకాలను నిలిపివేయాలని దేవస్థానం నిర్ణయించింది.
అయా అభిషేకాలు నిలిపివేసిన రోజులివే
తేదీ ———– వారం
ఆగస్టు 12 —— శనివారం
ఆగస్టు 13 —— ఆదివారం
ఆగస్టు 14 —— సోమవారం
ఆగస్టు 15 —— స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 19 —— శనివారం
ఆగస్టు 20 —— ఆదివారం
ఆగస్టు 21 —— సోమవారం
ఆగస్టు 25 —— వరలక్ష్మి వ్రతం
ఆగస్టు 26 —— శనివారం
ఆగస్టు 27 —— ఆదివారం
ఆగస్టు 28 —— సోమవారం
ఆగస్టు 31 —— శ్రావణ పౌర్ణమి
సెప్టెంబర్ 2 —- శనివారం
సెప్టెంబర్ 3 —- ఆదివారం
సెప్టెంబర్ 4 —- సోమవారం
సెప్టెంబర్ 6 —- శ్రీ క్రుష్ణాష్టమి
సెప్టెంబర్ 9 —- శనివారం
సెప్టెంబర్ 10 —- ఆదివారం
సెప్టెంబర్ 11 —- సోమవారం
పై తేదీల్లో భక్తులకు విడతల వారీగా స్వామి వారి స్పర్శ దర్శనం.. అలంకార దర్శనం వేళలు
స్లాట్ ————– సమయం ——————————- దర్శనం
ఉదయం ——– ఉదయం 4.30 గం నుంచి 6.30 గం వరకు ——– అలంకార దర్శనం
1వ స్లాట్ ——— ఉదయం 6.45 గం నుంచి 8.30 గం వరకు ——— స్పర్శ దర్శనం
———— ఉదయం 8.30 గం నుంచి 11.30 గం వరకు ———– అలంకార దర్శనం
2వ స్లాట్ ——— మధ్యాహ్నం 12 గం నుంచి 1.30 గం వరకు ——— స్పర్శ దర్శనం
—————– మ. 1.30 గం నుంచి సా. 4.00 గం వరకు ——- అలంకార దర్శనం
సాయంత్రం —- సా 5.20 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు — అలంకార దర్శనం
3వ స్లాట్ ——– రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ————- స్పర్శ దర్శనం
————— రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ——— అలంకార దర్శనం
4వ స్లాట్ —— రాత్రి 10 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు — స్పర్శ దర్శనం
శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం టికెట్లు ఆన్లైన్లో పొందాల్సి ఉంటుంది. దేవస్థానం వెబ్సైట్ – `www.srisailadevasthanam.org` ద్వారా భక్తులు ముందస్తుగా ఆయా టికెట్లు పొందొచ్చు. శ్రీశైలం దేవస్థానం యాప్ ద్వారా కూడా ఈ టికెట్లు పొందొచ్చు. ఇప్పటికే ఆగస్టు మాస టికెట్ల కోటాను దేవస్థానం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సెప్టెంబర్ మాస టికెట్ల కోటా ఈ నెల 25 నుంచి అందుబాటులో ఉంచుతారు.
టికెట్ల లభ్యతను బట్టి దర్శన సమయం ప్రారంభానికి ఒక గంట ముందు వరకూ కూడా భక్తులు ఆన్లైన్లో టికెట్లు పొందే అవకాశం కల్పించింది దేవస్థానం. స్వామి వార్ల స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారు టికెట్ కాపీ (హార్డ్ కాపీ), ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీ తప్పనిసరిగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆయా సేవా టికెట్లు స్కాన్ చేసి.. ఆధార్ గుర్తింపుకార్డుతో సరి చూసిన తర్వాతే భక్తులను ఆయా ఆర్జిత సేవలు చేయడానికి అనుమతిస్తారు.
పై నిర్ధిష్ట రోజుల్లో కాకుండా తక్కిన మామూలు రోజుల్లో అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి కల్పించే ఉచిత స్పర్శ దర్శనం యధావిధిగా కొనసాగుతుంది. కనుక ఆర్జిత సేవలు జరిపించే భక్తులు ఆయా ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్ల లభ్యతకు అనుగుణంగా తమ శ్రీశైల యాత్ర రూపొందించుకోవాలని ఈఓ లవన్న కోరారు.
రూ.150 రుసుముతో శీఘ్ర దర్శనం (శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే), రూ.300 రుసుముతో అతి శీఘ్ర దర్శనం టికెట్లు (శ్రీ స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే) ఆన్ లైన్ తోపాటు కరంట్ బుకింగ్ ద్వారా పొందవచ్చు. ఈ టికెట్లలో 30 శాతం ఆన్ లైన్, 70 శాతం కరంట్ బుకింగ్ తర్వాత విక్రయిస్తారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

