Murder : ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు (Prodduturu town) లో ఇవాళ ఉదయం దారుణం జరిగింది. తల్లి మందలించడంతో ఆగ్రహించిన కుమారుడు ఆమె గొంతు కోసి చంపేశాడు. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ్ నగర్ (Sriram Nagar) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
తల్లి లక్ష్మీదేవి వంటింట్లో ఉండగా కుమారుడు యశ్వంత్‌రెడ్డి ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన యశ్వంత్ కత్తితో తల్లి గొంతు కోశాడు. రక్తపు మడుగులో పడివున్న తల్లిని ఈడ్చుకుంటూ ఇంటి బయటికి తీసుకొచ్చి వాకిట్లో పడేశాడు. తల్లి హత్య సమయంలో యశ్వంత్‌రెడ్డి తన తండ్రిని గదిలో బంధించాడు.
కాగా మృతురాలు లక్ష్మీదేవి ఈశ్వర్‌రెడ్డి నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేవాడు. నిందితుడు యశ్వంత్ బీటెక్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు.