హైదరాబాద్: కర్ణాటకలోని హోస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. శుక్రవారం తెల్లవారుజామున హోస్కోట వద్ద లారీని ఢీకొట్టింది. దీంతో మూడు నెలల బాబు సహా ఆరుగురు మృతిచెందారు. మరో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల్లో కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (4), మూడు నెలల బాబు ఉన్నారని చెప్పారు. వీరంతా చిత్తూరు జిల్లాకు గంగాధర నెల్లూరు నియోజకవర్గాని చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.