అమరావతి : గత వారం రోజులుగా ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు సంస్థ ( SIT Report ) సంచలన రిపోర్టును అందజేసింది. సాయికృష్ణ( Saikrishna )ను లాకప్‌డెత్ ( Custodial Death) చేశారని సీఐ నాగరాజు( CI Nagaraj ) రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను నమోదు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెషన్‌కు గురైన కృష్ణలంక సీఐ నాగరాజును సిట్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేసి విచారించారు.
సాయికృష్ణ మృతదేహాన్ని స్టేషన్లో తాను చూశానని స్టేషన్ ఎస్సై ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. పోలీసు కస్టడీలోనే చనిపోయాడనే దానికి ఆధారాలు ఉన్నాయని సిట్ స్పష్టం చేసింది. స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా మాయం చేశారని, మృతుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టింది. సాయికృష్ణ చనిపోయాడని తెలిసినా కృష్ణలంక పీఎస్ సిబ్బంది మెజీస్ట్రేట్కు సమాచారం ఇవ్వలేదని, సాక్ష్యాలు మాయం కావడానికి సీఐ నాగరాజే కారణమని ఆరోపించింది. కాగా సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు జూలై 8వ తేదీవరకు రిమాండ్ విధించింది.