అమరావతి : ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ (YCP) కి షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన జగ్గయ్యపేట (Jaggaiahpeta) మున్సిపల్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు టీడీపీలో చేరారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ (Muncipal Chairman) రంగాపురం రాఘవేంద్ర రావు, వార్డు కౌన్సిలర్లు(Councillors) పూసపాటి సీతారావమ్మ, గింజుపల్లి వెంకట్రావు, రమాదేవితో పాటు వైసీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సమక్షంలో టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ స్థానిక సంస్థలను పట్టించుకోలేదని విమర్శించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఉదయభాను కూడా వైసీపీ వీడతారనే ప్రచారం జరుగుతుందని వెల్లడించారు. జగ్గయ్యపేట మున్సిపల్ పరిధిలో 31 మంది సభ్యులకు గాను గతంలో 17 మంది వైసీపీకి, 14 మంది టీడీపీ సభ్యులున్నారు. ప్రస్తుతం వీరి చేరికతో టీడీపీ బలం 18కి పెరుగగా వైసీపీ సంఖ్య 13కు పడిపోయిందన్నారు.