అమరావతి : వరుసకు చెల్లెలయ్యే బాలికపై లైంగిక దాడికి యత్నించిన కామాంధుడికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామంలో ఓ యువకుడు చిన్నారిని పంట పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కామాంధుడి బారి నుంచి తప్పించుకుని పారిపోయిన చిన్నారి ఏడుస్తుండగా స్థానికులు గమనించి వివరాలు సేకరించి పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం గ్రామంలో దాక్కున కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.