(Sajjala coments) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాసేవలో పునరంకతమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలు వెసులుబాటుగా పనిచేయగా.. కరోనా కారణంగా అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. ఎలాంటి వనరులు లేకుండా విడిపోయిన రాష్ట్రం.. కరోనా కారణంగా మరింత ఇబ్బంది పడిందని చెప్పారు. గత ప్రభుత్వం మిగిల్చిన రుణభారాన్ని మోస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి వస్తున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వం హామీల అమలు విషయంలో వెనక్కు తగ్గేది లేదని అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ఒకవేళ ఏదైనా పథకం అందకపోతే ఎలాంటి టైమ్ లిమిట్ లేకుండా వారిని ఎప్పుడైనా లబ్ధిదారులుగా చేర్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. దేశంలో ఈ విధానం ఎక్కడా లేదని, ఇది కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రజలకు, నాయకులకు, పార్టీ శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..