హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కడప జిల్లాలో వర్షం బీభత్సాన్ని సృష్టించింది. రాజంపేటలో భారీ ప్రాణనష్టం సంభవించింది. దాదాపు 30 మందికి పైగా వరదనీటిలో కొట్టుకుపోయారు. ఇప్పటివరకు 12 మృతదేహాలు వెలికితీశారు. నందలూరు పరీవాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో మూడు ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఆర్టీసీ బస్సులోని కండక్టర్, ఇద్దరు ప్రయాణికులు వరద నీటిలో కొట్టుకుపోయారు. వరద ఉధృతికి జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగిపోయి పరీవాహక ప్రాంతాలైన గుం డ్లూరు, శేషామాంబాపురం, మండపల్లి గ్రామాలు నీట మునిగాయి. చెయ్యేరు
నది పోటెత్తి ఎనిమిది గ్రా మాలు నీటమునిగాయి. అనంతపురం జిల్లాలో చిత్రావతి నదిలో 10 మంది చిక్కుకున్నారు. చెన్నేకొత్తపల్లి మం డలం వెల్దుర్తి వద్ద నదిలో కారు చిక్కుకున్నది. అందులోని నలుగురిని రక్షించేందుకు మరో ఆరుగురు వెళ్లారు. విశాఖ, బెంగళూరు నుంచి రెండు హె లికాప్టర్లలో వచ్చిన రెస్క్యూ సిబ్బంది 10 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నెల్లూరు జిల్లానూ వ ర్షం ముంచెత్తింది. వెలిగల్లు, అన్నమ య్య, పింఛా, బుగ్గవంక, మైలవరం ప్రాజెక్టుల నుంచి వరదనీటిని వదల డంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
తిరుమలలోనూ ఎడతెరిపిలేని వ ర్షం కారణంగా నాలుగు మాడవీధుల్లో పెద్దఎత్తున వరదనీరు చేరింది. శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న మ్యూజియం వద్దకు కొండ ప్రాంతం నుంచి వరద నీరు ప్రవహిస్తున్నది. ఆ వరద మొత్తం లడ్డూ కౌంటర్ వద్ద నుంచి నాలుగు మాడవీధుల్లోకి చేరుకున్నది. క్యూలైన్లలోకి కూడా పెద్దఎత్తున నీరు చేరింది. తిరుమలలోని ఆర్జి త సేవా కార్యాలయంలోకి నీరు ప్రవహించడంతో సర్వర్లన్నీ స్తంభించిపోయాయి. తిరుమలలోని 10 ప్రాంతా ల్లో విరిగిపడిన కొండ చరియలను తొలగించారు. ఘాట్‌రోడ్డు మొత్తం వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. రెండు రోజులుగా మూసివేసి ఉన్న తిరుమల ఘాట్ రోడ్లను టీటీడీ పునరుద్ధరించింది. శేషాచలం కొండల నుంచి వస్తున్న భారీ వరద నీటితో తి రుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. నడక మార్గాలను కూడా మూసివేశారు. తిరుమల కొండల్లో నుంచి వచ్చే వరదనీరు కపిలతీర్థాన్ని ముంచెత్తింది. నీరు ఉధృతంగా వస్తుండటంతో పరిసర ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
ఏపీలో కురుస్తున్న వర్షాలపై ప్రధా ని మోదీ ఆరా తీశారు. సీఎం వైఎస్ జ గన్‌కు ఫోన్ చేశారు. సహాయ చర్యలపై అడిగి తెలుసుకున్నారు. నష్ట నివారణ కు అన్ని విధాలా సాయమందిస్తామని హామీ ఇచ్చారు. జగన్ సైతం అధికారులతో సమీక్షించారు. చెరువులకు గండ్లు పడిన చోట తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుమల, తిరుపతిలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ నటుడు చిరంజీవి స్పందించారు. వర్షా లు, వరదలతో స్థానికులు ఇబ్బందులు పడటం బాధగా ఉందని ట్వీట్ చేశా రు. తిరుపతి, చెన్నైలో కురుస్తున్న భా రీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసి మరి కొన్నింటిని దారి మళ్లిస్తున్న ట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.