Krishnaiah resign | రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా .. ఆమోదించిన చైర్మన్
Krishnaiah resign | బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఏపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అమరావతి : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఏపీ రాజ్యసభ సభ్యుడు ( Rajya Sabha ) ఆర్ కృష్ణయ్య(R Krishnaiah) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిన్న రాజీనామాను సమర్పించగా రాజ్యసభ చైర్మన్ (Chairman) మంగళవారం ఆమోదించారు. వైసీపీ(YCP) నుంచి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య తన పదవికాలం మరో నాలుగేళ్ల పాటు ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు.
2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు రాజీనామా బాట పట్టారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఎమ్మెల్సీలు, పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన చైర్మన్లు, మేయర్లు సైతం వైసీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీ, జనసేన పార్టీలో చేరారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 11 స్థానాలకు గాను 11 స్థానాలను వైసీపీ గెలుచుకుని సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కృష్ణయ్య రాజీనామాతో వైసీపీకి మరో గట్టి షాక్ తగిలినట్లయ్యింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

