AP Minister | తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి పాపం మాజీ సీఎం జగన్దే : ఏపీ మంత్రి
AP Minister | తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన పాపం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని, ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
AP Minister : తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన పాపం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని, ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే తన బంధువులైన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను టీటీడీ చైర్మన్లుగా, తనకు అనుకూలమైన అధికారి ధర్మారెడ్డిని ఈవోగా నియమించారని మండిపడ్డారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి విషయంలో జగన్ అన్నీ అబద్దాలు చెబుతున్నారని సత్యకుమార్ విమర్శించారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఆందోళనకు గురయ్యారన్నారు. నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని, బయట ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పిన జగన్ డిక్లరేషన్ సంతకం చేసే ధైర్యం లేకనే తిరుమలకు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. తిరుమలకు వెళ్లకుండా ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ నాయకులను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

