Vasudeva Perumal | అర్చకులు ఆలయాల్లో పూజలతో బిజీగా ఉంటారు. నిత్యం ఏదో ఒక మంత్రోచ్ఛారణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ దేవుడి సేవలో ఉండే అర్చకులు.. కాస్త ఆ సేవకు విరామం ఇచ్చారు. వాసు దేవుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. అర్చకులు బ్రేక్ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. డ్యాన్సర్లకు ఏ మాత్రం తీసిపోకుండా స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో అర్చకుల బ్రేక్ డ్యాన్స్‌లు ఏంటని సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని చారిత్రక ప్రాముఖ్యత గల శ్రీ వాసుదేవ పెరుమాళ్ 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 17వ తేదీన ప్రారంభమయ్యాయి. ఇక ఆదివారం(ఫిబ్రవరి 23) రాత్రి వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు కూడా భారీగా తరలివచ్చారు. అయితే ఆదివారం రాత్రి దేవదేవుని ఊరేగింపు మంగళ వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలు నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించాల్సిందిపోయి.. వాసు దేవుని ఊరేగింపు డీజే పాటలతో బ్రేక్ డాన్స్‌లతో కొనసాగింది. డీజే పాటలకు అర్చకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. బ్రేక్ డాన్సులతో ఊరేగింపు నిర్వహించారు. అర్చకుల బ్రేక డ్యాన్స్‌లతో కొనసాగిన వాసుదేవుని ఊరేగింపుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాల్లో బ్రేక్ డాన్స్ చేసిన అర్చకులు pic.twitter.com/o95QQxI4uG
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2025