తిరుమల అగ్నిప్రమాదం.. విచారణలో విస్తుగొలిపే వాస్తవం
తిరుమల అగ్నిప్రమాదం | తిరుమలలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సజీవ దహనమైన వ్యక్తి మల్లిరెడ్డిది ఆత్మహత్యగా నిర్ధారించారు. షాపు నెం.84 వద్ద పెట్రోల్ పోసుకుని మల్లిరెడ్డి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు.

అమరావతి : తిరుమలలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సజీవ దహనమైన వ్యక్తి మల్లిరెడ్డిది ఆత్మహత్యగా నిర్ధారించారు. షాపు నెం.84 వద్ద పెట్రోల్ పోసుకుని మల్లిరెడ్డి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు.
ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకోవడంతో సమీపంలోని ఇతర దుకాణాలకు మంటలు అంటుకొని దగ్ధమైనట్లు తేల్చారు. మల్లిరెడ్డి తన మొబైల్, పర్స్ మరో షాపులో ఉంచినట్లు గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతుడి భార్య శోభ సహాయంతో మొబైల్ లాక్ తీసి పరిశీలించారు. మంగళవారం వేకువజామున 5 గంటల సమయంలో మల్లిరెడ్డి ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్టు గుర్తించారు.
ఆ వీడియోలో ఏం చెప్పారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతున్నది. ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మల్లిరెడ్డి పోస్టుమార్టం నివేదిక రాగానే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firefighters | ఫైర్మన్లకు ‘అగ్ని’ పరీక్ష.. హెవీ వెహికిల్ లైసెన్స్ ఉంటేనే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు!
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

