అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనదీక్షపై ఏపీ మంత్రి శంకర్ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూపురం జిల్లా కేంద్రం కోసం అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంపై మంత్రి స్పందించారు. బాలయ్య రాజీనామా చేయాలని ప్రజలే కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఏడు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి హిందూపూర్ అభివృద్ధికి బాలయ్య ఏమి చేయలేదని ఆరోపించారు. ఆయనకు సినిమా షూటింగ్లు లేనప్పుడే ప్రజలు గుర్తుకొస్తారని విమర్శించారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఏ జిల్లాకైనా ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎందుకు ఆలోచన రాలేదు ప్రశ్నించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి జిల్లా కేంద్రంగా ఉండడం సబబేనని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.