Pawan Kalyan| ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఒప్పుకున్న సినిమాలని పూర్తి చేస్తూనే మరోవైపు రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పూడిచెర్ల బహిరంగ సభలో ఆయన సందడి చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా టీడీపీ, జనసైనికులు తరలివచ్చారు. అయితే ఈ సభలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ కార్యకర్త తన బిడ్డ తలకు ఎర్రటి తువ్వాలు చుట్టి.. అచ్చం పవన్ కళ్యాణ్ లా రెడీ చేసి తీసుకు రాగా, అతను పవన్ కంట పడ్డాడు. వెంటే అది గమనించిన పవన్ కళ్యాణ్ ఆ బుడ్డోడిని స్టేజ్ మీదకి తీసుకురావాలని కోరాడు.
బుడ్డోడు వేదిక మీదకు రావడంతో వెంటనే బుజం మీద కూర్చోపెట్టుకొని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక ఇదే సభలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ ఓజీ అని నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్ కనిపిస్తే చాలు.. ఆయన అభిమానులకు పూనకాలు రావడం కామన్. ఓజీ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి కల్యాణ్ ఎక్కడ కనిపించినా ఓజీ ఓజీ అంటూ అరుస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని పూడిచర్లలో పంట కుంట నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసి అనంతరం సభలో ప్రసంగిస్తుండగా ఫ్యాన్స్ చేసిన ఓజీ సౌండ్.. రీసౌండ్ గా మారింది. దాంతో పవన్ కళ్యాణ్ నేను ఇప్పుడు డిప్యూటీ సీఎంని.. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేస్తుంటే.. ఫ్యాన్స్ ఇంకా ఓజీ మూడ్‌లోనే ఉండిపోవడం తనకు నచ్చలేదంటూ పవన్ నవ్వుతూ చెప్పారు. అయితే మీతో పెట్టుకోలేం.. మీకో నమస్కారం అనేశారు పవన్ కల్యాణ్.
Heart warming moment in today’s meeting !#PawanKalyanAneNenu pic.twitter.com/wfvqQ2IuiT
— JanaSena Party (@JanaSenaParty) March 22, 2025