అమరావతి : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ( Pawan Kalyan ) ఏ మాత్రం సిద్ధాంతాలు లేవని, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ అర్థం కాదని , చివరికి ఆయనకు కూడా అర్థం కాదేమోనని వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు (Ambati Rambabu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమయనుకూలంగా ఊసరవెల్లిలా మారుతూ మభ్యపెడుతున్నాదని విమర్శించారు.
వైసీపీ ( YCP ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిన్నటి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం తీరుపై విమర్షలు చేశారు. రాష్ట్ర ప్రజానికానికి అండగా నిలబడుతామని హామీ ఇచ్చిన పవన్ గద్దె నెక్కిన తరువాత ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
టీడీపీ కోసమే జనసేన ఆవిర్భావం..
నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టింది జనసేన పార్టీ అని పవన్ అంగీకరించడం సముచితంగా ఉందన్నారు. టీడీపీని నిలబెట్టేందుకే జనసేన రాజకీయ పార్టీ పుట్టిందని అన్నారు. వైసీపీ మొదటి నుంచి కూడా చెబుతున్నది ఇదేనని స్పష్టం చేశారు. జనసేనను బీ టీం పార్టీగా చంద్రబాబు ( Chandra babu ) వదిలారని విమర్శించారు.
చంద్రబాబు కుట్రలో భాగమే కాపులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి టీడీపీకి ఓట్లు మళ్లీంచేందుకు జనసేన పార్టీ ఏర్పాటని ఆరోపించారు. ఆ పార్టీని పరోక్షంగా నడుపుతున్నది చంద్రబాబేనని విమర్శించారు. గత ఎన్నికల్లో 175 సీట్లకు బదులు కేవలం 21 స్థానాల్లో మాత్రమే పోటీచేసి గెలిచిన జనసేనకు వందశాతం స్ట్రైక్‌రేట్ వచ్చిందని గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు టీడీపీ, వైసీపీ నుంచి టికెట్లు రాకపోవడంతో జనసేనలో చేరి గెలుపొందారని తెలిపారు.
వందశాతం జనసేనకు చెందిన నాయకులెవ్వరూ కూడా గెలువలేదని విమర్శించారు. కూటమి ఇచ్చిన హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. రాజకీయంలోకి వచ్చి ఆరోగ్యం చెడగొట్టుకున్నానని చెప్పుకోవడం విచిత్రంగా ఉందని తెలిపారు. కుటుంబ రాజకీయాలు సరికాదని పేర్కొన్న పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎందుకు అవకాశమిచ్చారని ప్రశ్నించారు. గద్దె నెక్కి ఏం సాధించారని ఆరోపించారు.