అమరావతి : తెలుగు నుడికారానికి, తెలుగు నేలకు, తెలుగు జాతికి మరింత సొబగులు అద్దినవారిలో ఎన్టీఆర్ ఒకరని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ (NTR) జయంతి సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శైలి అజరామరమని తెలిపారు.
రెవెన్యూ వ్యవస్థ (Revenue System) లో ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు, రూ. 2 కే పేదలకు బియ్యం(Rice) చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని నా పక్షాన, జనసేన (Janasena) పార్టీ పక్షాన స్వర్గీయ ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తున్నానని వెల్లడించారు.
తాత ఎన్టీఆర్ తనకు నిత్యస్ఫూర్తి : నారా లోకేష్
తాత ఎన్టీఆర్ తనకు నిత్యస్ఫూర్తి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. తెలుగుజాతి కీర్తి కిరీటం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు.