హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో ఈ నెల 9, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో భక్తుల రద్దీ, వివిధ ప్రత్యేక కా ర్యక్రమాల దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దుతోపాటు సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఆషాఢ సారె మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఉద్యోగులు మేళతాళాలతో వచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ ఉత్సవాలు వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగనున్నాయి.