New Political Party | ఏపీలో దసరాకు కొత్తపార్టీ ఆవిర్భావం : విజయసాయి రెడ్డి
New Political Party | మాజీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఏపీలో రెండు ప్రధాన పార్టీలపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అమరావతి : మాజీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy ) సంచలన ప్రకటన చేశారు. ఏపీలో రెండు ప్రధాన పార్టీలపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రాజకీయ పార్టీ ( New Political Party ) ఏర్పాటు కానున్నదని వెల్లడించారు. దసరాకు తన పార్టీని జెండాను , ఏజెండాను ప్రకటిస్తానని తెలిపారు.
త్వరలో తాను రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నయంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు. అనంతరం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీని తీవ్రంగా విమర్శించారు.
ప్రస్తుతం ఏపీలో టీడీపీ రెడ్బుక్ ( Red Book) పాలన కొనసాగిస్తుండగా, ప్రతిపక్ష పార్టీ వైసీపీ రప్పా రప్పా పార్టీలను నడిపిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ , వైసీపీ పార్టీలు రాష్ట్రానికి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను సీఎంను కానని, కేవలం సలహాలు మాత్రమే ఇస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రెండు రాజకీయ పార్టీలే పాలించాలా, రెడ్డు, కమ్మలే సీఎంలు కావాలా అని ప్రశ్నించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

