అమరావతి : ఆరోగ్యశ్రీ (Arogyashri ) ఆసుపత్రుల పెండింగ్ బకాయిల చెల్లింపునకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో వైద్యసేవలను యథావిధిగా కొనసాగించడానికి ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. శనివారం ఏపీ వైద్యశాఖ మంత్రి సత్యకుమార్(Minister Satyakumar) ఆసుపత్రుల సంఘం నాయకులతో చర్చలు జరిగాయి. చర్చల్లో వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవో పాల్గొన్నారు.
సోమవారం రూ. 500 కోట్లు విడుదలకు మంత్రి అంగీకరించారని సంఘం నాయకులు విజయ్‌కుమార్ తెలిపారు. వచ్చే నెలాఖరుకు మరో రూ. 250 కోట్లు విడుదల చేయాలని మంత్రిని కోరామని ఆయన వివరించారు. నెట్వర్క్ ఆస్పత్రుల(Network Hospitals) సమస్య శాశ్వత పరిష్కారానికి మంత్రి కృషి చేస్తామన్నారు.
గత రెండేళ్లుగా నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ. 2,500 లు బకాయిలు పడ్డాయి. బకాయిలు చెల్లించకపోతే ఆగస్టు15 నుంచి సమ్మెలోకి వెళతామని హెచ్చరించాయి. ఈ మేరకు రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల చేశారు. దీంతో రోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించి శనివారం ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చలు సఫలం కావడంతో రోగులు ఊపిరిపీల్చుకుంటున్నారు.