శ్రీశైలం : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) గురువారం నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని(Mallikarjuna Swamy) దర్శించుకున్నారు. నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి(Brahmini) , కుమారుడు దేవాన్స్(Devansu) ను కర్నూలు జిల్లా సున్నిపెంట హెలిప్యాడ్వద్ద మాజీ మంత్రి భూమ అఖిలప్రియ, టీడీపీ(TDP) నాయకులు ఎన్ఎండీ ఫరూక్ రాజశేఖర్రెడ్డి , జనసేన నాయకులు స్వాగతం పలికారు.
ముందుగా సాక్షి గణపతిని దర్శించుకున్న అనంతరం శ్రీశైలం(Srisailam) ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి రుద్రాభిషేకం(Rudrabhishekam) , అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు.