అమరావతి: త్వరలో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ సీఎం జగన్తో విభేదాల కారణంగా ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనర్హత వేటు వేయించుకునేందుకు సమయం ఇస్తున్నాని, వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని చెప్పారు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానని చెప్పారు. ఆ పార్టీ నుంచి తొలగించాలని చూసినప్పటికీ సాధ్యంకాలేదన్నారు. ఏపీకి పట్టిన దరిద్రం వదిలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలన్నారు. కాగా, ఈనెల 5న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. దీంతో ఆయన త్వరలోనే కాషాయ కండువ కప్పుకోనున్నారనే వార్తలు వచ్చాయి.