విజయవాడ: ఇంటెలిజెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో ఉమ్మడి పరిశోధన కోసం లింక్డ్ఇన్తో ఆంధ్రప్రదేశ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఇటీవలే అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పై సంతకం చేసింది. ఎన్ఐటీ-ఏపీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీఎస్పీ రావు, లింక్డ్ఇన్ బిజినెస్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ నాగ కృష్ణ ఆర్.సత్వల్లి ఒప్పందంపై సంతకాలు చేశారు. లింక్డ్ఇన్ తరపున డాటా, ఏఐ ప్లాట్‌ఫారమ్‌ల విభాగం డైరెక్టర్ చిదంబరన్ కొల్లెంగోడ్ ఈ పరిశోధన సహకారానికి నాయకత్వం వహిస్తున్నారు.
లింక్డ్ఇన్, ఏపీ ఎన్ఐటీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, మేధస్సు, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఓపెన్ రీసెర్చ్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కార్తీక్ శేషాద్రి, నిట్-ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్, సహ-పరిశోధకుడు డాక్టర్ నగేష్ భట్టు శ్రీస్టీ లకు రీసెర్చ్ గ్రాంట్ ఇవ్వనున్నారు. ఈ ఎంఓయూ గురించి ప్రొఫెసర్ సీఎస్పీ రావు మాట్లాడుతూ, ఈ ఒప్పందం విద్యారంగం ద్వారా పరిశ్రమ సంబంధ సమస్యలను పరిష్కరించడానికి పరిశోధనలను ప్రోత్సహిస్తుందని చెప్పారు.