AP Minister Roja | ఈసారి రోజాకు టికెట్ లేనట్లేనా?… నగరి అభ్యర్థి మార్పు తప్పదా?
AP Minister Roja | ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ నాయకుల్లో గుబులు పుడుతుంది. ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పునకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుండడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది.
అమరావతి : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ నాయకుల్లో గుబులు పుడుతుంది. ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పునకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుండడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు.
దశల వారీగా ఎమ్మెల్యేలను పిలిచి ఈ విషయం చెబుతుండడంతో ఎక్కడా తమ వంతు వస్తుందేమోనన్న భయం ఛాయలు వైసీపీ ఎమ్మెల్యేలలో స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఏపీ టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజా(Minister Roja) సెల్వమణి కూడా టికెట్ రావడం లేదన్న ప్రచారంపై స్పందించారు. మంగళవారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
నగరి నియోజకవర్గం నుంచి సీటు రావడం లేదన్న వ్యాఖ్యలపై స్పందించారు. ‘తనకు సీటు ఇవ్వకపోయిన ఇబ్బందేమి లేదు. తాను జగనన్న సైనికురాలిని. జగనన్న కోసం ప్రాణాలైన ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఈ విషయం అనేక సందర్భాల్లో చెప్పా. నగరిలో ఎవరికి టికెట్ ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదని’ పేర్కొన్నారు. తనకు సీటు ఉందో లేదో నన్న విషయం కార్యకర్తలకు, నాయకులకు తెలుసునని వెల్లడించారు. తనకు సీటు లేదని మీరు(మీడియా) ఆనందపడినా ఇబ్బంది ఏమీ లేదని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

