AP News | పవన్ కల్యాణ్ ఆఫీసులో మంగళగిరి సీఐ అత్యుత్సాహం.. బదిలీ వేటు
AP News | మంగళగిరిలోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయంలో భద్రతా సిబ్బందితో సీఐ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించారు. బుధవారం పవన్ కల్యాణ్ ఉన్న సమయంలోనే అనుమతి లేకుండా ఆఫీసులోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు
AP News | మంగళగిరిలోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయంలో భద్రతా సిబ్బందితో సీఐ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించారు. బుధవారం పవన్ కల్యాణ్ ఉన్న సమయంలోనే అనుమతి లేకుండా ఆఫీసులోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారాహి దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్ అమ్మవారికి పూజలు చేస్తున్న సమయంలోనే ఆయన లోపలికి వెళ్లేందుకు ట్రై చేశారు. దీంతో కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పిన భద్రతా సిబ్బందిపై సీరియస్ అయ్యారు. వాళ్ల మాటలు పట్టించుకోకుండా బూటు కాళ్లతోనే లోపలికి వెళ్లారు.
మంగళగిరి టౌన్ సీఐ శ్రీనివాసరావు దురుసు ప్రవర్తనపై డిప్యూటీ కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు శ్రీనివాసరావుపై బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో త్రిపురాంతకం సీఐ వినోద్‌కుమార్‌ను నియమించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు.
సీఐ శ్రీనివాసరావు గతంలో కూడా జనసేన నాయకులతో ఇలాగే దురుసుగా ప్రవర్తించారు. ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఉండే అపార్ట్మెంట్లోకి వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

