తిరుమల : తిరుమల లడ్డూ( Laddu) వ్యవహారం నుంచి ఆలయ పవిత్రతను కాపాడడానికి టీటీడీ(TTD) ఉపశమన చర్యలకు ఉపక్రమించింది. నైవేద్యం, లడ్డూలో జంతువుల నూనేను వాడారని స్వయాన టీటీడీ ఈవో వెల్లడించిన దరిమిలా శనివారం ఈవో శ్యామలారావు (EO Shayamala rao) ఆధ్వర్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారులు, ఆలయ ప్రధాన అర్చకుడు, , అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లడ్డూ అపవిత్రమైన దృష్ట్యా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతియాగం (Mahashanthiyagam) నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .
గత మూడు రోజులుగా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని వస్తున్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ వ్యవహారంపై అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కల్తీ నెయ్యిని వాడడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాజకీయ పార్టీల నాయకులు. ధార్మిక సంఘాల ప్రతినిధులు, అర్చకులు, సినీ నటులు స్పందించి జరిగిన ఘటనను తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో దోషులను శిక్షించాలని కోరారు.