Tirumala | తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. ఆందోళనలో భక్తులు..!
Tirumala | తిరుమల క్షేత్రంలో చిరుత సంచరిస్తున్నది. శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం సమయంలో చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. ఒక్కసారిగా దగ్గరలోనే చిరుత ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు.
Tirumala | తిరుమల క్షేత్రంలో చిరుత సంచరిస్తున్నది. శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం సమయంలో చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. ఒక్కసారిగా దగ్గరలోనే చిరుత ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు. పలువురు భక్తులు వెంటనే దగ్గరలో ఉన్న వారికి సమాచారం అందించడంతో అందరూ అప్రత్తమయ్యారు. ఆ తర్వాత భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు చిరుత సంచారంపై సమాచారం అందించారు. వెంటనే టీటీడీ అధికారులకు అటవీశాఖకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్‌కు సమీపంలోనే అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా టీటీడీ, అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో వెంటనే భక్తులను అప్రమత్తం చేస్తూ.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దర్శనాల కోసం వచ్చే భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వెళ్లొద్దని.. గుంపులు గుంపులుగా తిరగాలని సూచించారు. గతంలో చిరుత దాడిలో ఓ చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీటీడీ, అటవీశాఖ అధికారులు కలిసి పలు చిరుతలను పట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలించారు. మళ్లీ తాజాగా చిరుత సంచారంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

