అమరావతి : తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lau Srikrishna Devarayalu) పేరును పార్టీ అధినేత చంద్రబాబు(Chandra Babu) నాయుడు ఖరారు చేశారు. శనివారం సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ (TDP) సభ్యులు అనుసరించాల్సిన వైఖరిని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు.
నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు ఎంపీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 1,59,729 ఓట్ల మెజారిటీతో సమీప వైసీపీ అభ్యర్థిని ఓడించారు.