అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించారు. గుడ్లూరు మండలం మొండివారిపాలెంలో రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రామాయ పట్నం పోర్టు నిర్మాణానికి 850 ఎకరాలను సేకరించామని, రూ. 3,700 కోట్లతో పోర్టు పనులు ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో ఆరు పోర్టులే కాకుండా మరో నాలుగు పోర్టులకు త్వరలో భూమి పూజ చేస్తామని వెల్లడించారు.
పోర్టు నిర్మాణం వల్ల 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెచ్చామని దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు వస్తాయని అన్నారు. పోర్టుల వల్ల పరిశ్రమలు ఏర్పడుతాయని, ఈ ప్రాంత రూపు రేఖలు మారిపోతాయని అన్నారు.
ఎన్నికలకు రెండు నెలల ముందర టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డీపీఆర్, ల్యాండ్ సమీకరణ లేకుండా శంకుస్థాపన చేసి మోసం చేశారని విమర్శించారు. రుణమాఫీ అంటు రైతులను, మహిళలను, విద్యార్థులను మోసం చేశారని ఆరోపించారు.